Anil Kapoor: సోనం కపూర్ సినిమాతోనే రెజీనా బాలీవుడ్ ఎంట్రీ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా. బాలీవుడ్‌పై కన్నేసిన ఈ భామ అక్కడ మంచి చిత్రంతోనే అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఆమె తెలుగులో చేసిన తాజా చిత్రం 'అ' సక్సెస్ సాధించింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనం కపూర్‌ నటిస్తున్న 'ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా' చిత్రం ద్వారానే రెజీనా హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించనుందని తెలిసింది.

ఈ సినిమాను షెల్లీ చోప్రా ధర్ డైరెక్టు చేస్తున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావ్, అనిల్ కపూర్, జూహీ చావ్లా తదితర సీనియర్ నటులు నటిస్తున్నారు. తమ సినిమాలో ఓ దక్షిణాది భామ ఉంటే బావుంటుందని ఈ చిత్ర దర్శకనిర్మాతలు భావించారట. అలా దక్షిణాదిన తమకు నచ్చిన భామ కోసం అన్వేషిస్తుంటే వారి నజర్ రెజీనాపై ఆగిందని... అలా ఈ సినిమా చాన్స్ ఆమెను వరించిందని సమాచారం. తెలుగులో సుబ్రమణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
Go Back to Shorts
Anil Kapoor
Juhi Chawla
Regina
Bollywood

More Telugu News