Narendra Modi: బుందేల్ ఖండ్ కు వరాలు .. రూ.20 వేల కోట్ల ప్యాకేజ్, రక్షణ కారిడార్

  • ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ - 2018 లో పాల్గొన్న మోదీ
  • బుందేల్ ఖండ్ ప్రాంత అభివృద్ధికి రూ.20 వేల కోట్ల ప్యాకేజ్, రక్షణ పారిశ్రామిక కారిడార్ ప్రకటన
  • ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది : మోదీ
అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంత అభివృద్ధి నిమిత్తం రూ.20 వేల కోట్ల ప్యాకేజ్ తో పాటు రక్షణ పారిశ్రామిక కారిడార్ ను కూడా ప్రకటించారు. లక్ నవూలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2018 లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ లో ప్రస్తావించిన రెండు రక్షణ కారిడార్లలో ఒకదాన్ని బుందేల్ ఖండ్ కు కేటాయించామని, ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. రక్షణ కారిడార్ కారణంగా రాష్ట్రానికి రూ.20, 000 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. యూపీలో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఒక రాష్ట్రం ఒక ఉత్పత్తి’ అనే కొత్త పాలసీని ఆయన కొనియాడారు. జేవార్, కుశినగర్ ప్రాంతాల్లో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాలు వస్తాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. 
Narendra Modi
bundel khand

More Telugu News