Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం... యూపీ బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర మృతి

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • కారును ఢీకొన్న లారీ
  • ఎమ్మెల్యేతో ఉన్న ఇద్దరు గన్ మెన్లూ దుర్మరణం
  • అతి వేగమే కారణమంటున్న పోలీసులు
ఈ ఉదయం ఉత్తరప్రదేశ్ రాష్టంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ దుర్మరణం పాలయ్యారు. బిజ్నూర్ జిల్లా సితార్‌ పూర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొనగా, ప్రమాదంలో లోకేంద్ర అక్కడికక్కడే మరణించారు. ఆయన వెంటే ఉన్న ఇద్దరు గన్ మెన్లు కూడా మృతిచెందారు.

కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నా, అవి వారి ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలు అతి వేగంతోనే ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని లోకేంద్ర, ఆయన గన్ మెన్ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Uttar Pradesh
MLA
Lokendra Singh
Biznoor

More Telugu News