Hyderabad: అభిమానులను కలవని మహేష్ బాబు... ఆందోళనకు దిగిన ఫ్యాన్స్

  • హైదరాబాద్ 'అమరావతి' థియేటర్ లో ప్రిన్స్ కొత్త చిత్రం షూటింగ్
  • భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు
  • ఆయన్ను కలవనివ్వలేదని ఆందోళన
  • మహేష్ పీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఫ్యాన్స్
తమ అభిమాన హీరో ప్రిన్స్ మహేష్ బాబును కలవనివ్వలేదన్న ఆగ్రహంతో అభిమానులు ఆందోళనకు దిగిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఆయన కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లక్డీకాపూల్ లో ప్రస్తుతం మూతబడివున్న 'అమరావతి' థియేటర్ లో జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమను మహేష్ బాబుతో కలిపించాలని ఆయన పీఏ పరుచూరి కోటిని కోరగా, ఆయన నిరాకరించాడు.

దీంతో అభిమానులు కోటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. అభిమానుల నిరసన గురించి తెలుసుకున్నాడో, లేదో, మహేష్ బాబు తన షూటింగ్ ను ముగించుకుని మరోదారిలో బయటకు వెళ్లిపోయారు. దీంతో అభిమానుల ఆందోళన మరింత ఉద్ధృతం కాగా, వారికి సర్దిచెప్పి, అక్కడి నుంచి పంపేందుకు సైఫాబాద్ పోలీసులు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. పక్కనే కలెక్టర్ కార్యాలయం ఉండటం, అత్యంత బిజీగా ఉండే ప్రాంతం కావడంతో ఈ ఘటనతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది.
Hyderabad
Mahesh Babu
Amaravati
Lakdikapool

More Telugu News