వర్మ వ్యాఖ్యల ఫలితం...కీరవాణికి నోటీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్మ వ్యాఖ్యల ఫలితం...కీరవాణికి నోటీసులు!

  • మియా మల్కోవాతో లఘు చిత్రాన్ని తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ
  • ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ ప్రమోషన్ లో సామాజిక కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ
  • వర్మపై చర్యలు తీసుకోవాలంటూ కేసు పెట్టిన దేవి, మణి
అమెరికా పోర్న్ స్టార్ మియా మల్కోవాతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) లఘుచిత్రం ప్రమోషన్ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆ సినిమాకి పని చేసినవారందర్నీ ఇబ్బందుల్లోకి లాగుతున్నాయి. వర్మ అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త దేవీతో పాటు మణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ వారికి క్షమాపణలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

వర్మ క్షమాపణలను తిరస్కరించిన మణి, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోపక్క, ఆయనను హైదరాబాదు సీసీఎస్ పోలీసులు విచారించి, పలు వివరాలు సేకరించిన సంగతి కూడా తెలిసిందే. జీఎస్టీ సినిమాకు పని చేసిన వారందర్నీ ప్రశ్నించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ లఘు చిత్రానికి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఆ తరువాత వర్మ అసిస్టెంట్లను విచారించనున్నట్టు తెలుస్తోంది. 
ramgopal verma
gst
god S*x and truth

More Telugu News