Donald Trump: భారత గడ్డపై కాలుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ జూనియర్!

  • ఈ ఉదయం ఇండియాకు వచ్చిన జూనియర్ ట్రంప్
  • వారం రోజుల పాటు సాగనున్న పర్యటన
  • 'ట్రంప్ టవర్స్' కస్టమర్లకు ప్రత్యేక విందు
తన వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ ఉదయం ఇండియాలో కాలుపెట్టారు. తన పర్యటనలో భాగంగా కోల్ కతా, ముంబై, పుణె, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని 'ది వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. ఇండియాలో విదేశీ విధానంపై జరిగే సెమినార్ లో పాల్గొని జూనియర్ ట్రంప్ ప్రసంగిస్తారని ఆయన తరఫు ప్రతినిధులు వెల్లడించారు.

శుక్రవారం నాడు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొని 'రీషేపింగ్ ఇండో - పసిఫిక్ టైస్: ది న్యూ ఏరా ఆఫ్ కోఆపరేషన్' అనే అంశంపై ప్రసంగించనున్నారని తెలిపారు. ముంబైలో ఆయన సంస్థ నిర్మిస్తున్న లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు 'ట్రంప్ టవర్స్'ను సందర్శిస్తారని, వ్యాపార విస్తరణకు గల అవకాశాలపై సంస్థ అధికారులతో చర్చలు సాగించి సలహా, సూచనలు ఇస్తారని సమాచారం.

కాగా, ట్రంప్ రాకను స్వాగతిస్తూ సోమవారం నాటి దినపత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్టయిజ్ మెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ టవర్స్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన కస్టమర్లు, ఇతర ప్రముఖులకు ఈ వారంలో జూనియర్ ట్రంప్ ఓ ప్రత్యేక డిన్నర్ ను కూడా ఏర్పాటు చేశారు.
Donald Trump
Donald Trump Jr
India
USA
Mumbai
Trump Towers

More Telugu News