USA: ఎన్నికల్లో ఆమె నాతో పోటీ పడితే చిత్తుగా ఓడిస్తాను: డొనాల్డ్ ట్రంప్

  • ఓప్రా విన్ ఫ్రేపై ట్రంప్ చిందులు
  • అభద్రతా భావంతో ఆరోపణలు చేస్తోంది
  • ఓప్రా నాకు బాగా తెలుసు, దగ్గరగా పరిశీలించాను
ప్రముఖ టాక్ షో నిర్వాహకురాలు ఓప్రా విన్‌ ఫ్రేపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఏడాది పాలనపై చర్చావేదికను ఏర్పాటు చేసి, ఆయన విధానాలను ఆమె తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ అభద్రతా భావంతోనే తనపై ఓప్రా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె తనకు బాగా తెలుసునని చెప్పిన ట్రంప్, గతంలో తనను ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆమెను దగ్గరగా పరిశీలించానని అన్నారు.

ఆ ఇంటర్వ్యూలో ఆమె తనను అడిగిన ప్రశ్నలన్నీ పక్షపాతంగానే ఉన్నాయని విమర్శించారు. ఇప్పుడు తనపై ఆమె చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమైనవని ఆయన చెప్పారు. అసత్య ఆరోపణలతో ఆమె ప్రజలను ఆకర్షించాలని చూస్తోందని విమర్శించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తనతో ఆమె పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తానని చెప్పారు. కాగా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఓప్రా పోటీ చేసే అవకాశముందని అమెరికన్ మీడియా పేర్కొంటోంది. దానిని ఆమె సన్నిహితులు కూడా అంగీకరిస్తుండడం విశేషం. 
USA
Donald Trump
opra vin fre

More Telugu News