మీ చర్యలతో బకాయిల వసూళ్లకు అన్ని మార్గాలను మూసేసుకున్నారు... పీఎన్ బీకి నీరవ్ మోదీ లేఖ
- బ్యాంకు చర్యలు సరిగా లేవన్న నీరవ్
- మా బ్రాండ్, వ్యాపారం దెబ్బతింది
- మేం చెల్లించాల్సినది రూ.5,000 కోట్లలోపే -నీరవ్
"బకాయిల విషయంలో తప్పుగా ఆపాదించడం, మీడియాలో ఆ కథనాలు ప్రసారం కావడం, సోదాలు, స్వాధీనాలతో ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ మూతపడేందుకు దారితీశాయి. మా గ్రూపు బకాయిల చెల్లింపు సామర్థ్యాలను ఇది దెబ్బతీసింది. బకాయిలను వెంటనే వసూలు చేసుకోవాలన్న తొందరపాటు చర్యలు మా బ్రాండ్, వ్యాపారాన్ని దెబ్బతీశాయి’’ అని లేఖలో నీరవ్ మోదీ పేర్కొన్నారు. రూ.11,400 కోట్ల మేర నీరవ్ మోదీ ఆయన కంపెనీలు ఎల్ఓయూల ఆధారంగా రుణాలుగా పొంది చెల్లించలేదని పీఎన్ బీ వెల్లడించిన విషయం విదితమే.