Pawan Kalyan: అవిశ్వాసం పెట్టాలని పవన్ .. అవసరం లేదని చంద్రబాబు అంటున్నారు!: వైసీపీ నేత బొత్స ఎద్దేవా

  • చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందించాలి
  • బీజేపీతో మేము కుమ్మక్కైతే అవిశ్వాసం మాట ఎందుకంటాము?
  • బీజేపీతో నాలుగేళ్లు జతకట్టిన టీడీపీ నేతలు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు 
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని పవన్ కల్యాణ్, అవసరం లేదని చంద్రబాబు అంటున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అవిశ్వాసానికి తాము ‘సై’ అంటుంటే, వైసీపీకి చట్టాలు తెలియవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, మరి, చట్టాలు తెలిసిన చంద్రబాబు వేరే పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏ విధంగా కొనుగోలు చేశారని ప్రశ్నించారు.

బీజేపీతో తాము కుమ్మక్కయ్యామని టీడీపీ ఆరోపిస్తోందని, ఆ ఆరోపణలే నిజమైతే, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తాము ఎందుకు అంటామని ప్రశ్నించారు. బీజేపీతో నాలుగేళ్లపాటు జతకట్టిన టీడీపీ నేతలు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan
Botsa Satyanarayana
Chandrababu

More Telugu News