manohar parikar: మెరుగైన చికిత్స కోసం మనోహర్ పారికర్‌ను అమెరికాకు తరలిస్తాం: గోవా బీజేపీ నేత

  • మనోహర్ పారికర్‌కు ప్యాంక్రియాస్ సమస్య
  • లీలావతి ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స
  • అవసరమైతే అమెరికాకు.. మెరుగైన చికిత్స అందిస్తాం: మైఖెల్‌ లాబో
నాలుగు రోజుల నుంచి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకుంటున్నారని సదరు ఆసుపత్రి కూడా ప్రకటించింది. కాగా, బీజేపీ నేత, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మైఖెల్‌ లాబో తాజాగా మీడియాతో మాట్లాడుతూ... అవసరమయితే మెరుగైన వైద్యం కోసం పారికర్‌ను అమెరికాకు తరలిస్తామని తెలిపారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, మనోహర్ పారికర్ ప్యాంక్రియాస్ సమస్య ఏర్పడిన కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన వార్తలను బీజేపీ నేతలు ఖండించారు. 
manohar parikar
goa
america
BJP

More Telugu News