కీలక పరిణామం... కేంద్రంపై అవిశ్వాసానికి రాహుల్ గాంధీ ఓకే!
- ఎన్డీయేపై అవిశ్వాసం పెడదాం
- రాహుల్ గాంధీని కలిసి విన్నవించిన ఏపీ కాంగ్రెస్ నేతలు
- ఓకే చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు
- బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం
ఇక తనకు అవిశ్వాసం పెట్టడానికి అవసరమైనంత మంది ఎంపీల బలం లేదని, రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కూడా కలసి రావాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీని ఒప్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా జగన్ కోరారు. మరోవైపు వివిధ టీవీ చానళ్లు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుండగా, అవిశ్వాసం పెడితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని వక్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.