Anti-Terrorism Court: రేపిస్టుకి నాలుగు మరణశిక్షలు... చిన్నారిపై రేప్, మర్డర్ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు!

  • దోషికి నాలుగు మరణశిక్షలు, యావజ్జీవ శిక్ష
  • మరో ఏడుగురు బాలికలను కూడా రేప్ చేసి, హత్య చేసినట్టు అభియోగాలు
  • కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం

ఏడేళ్ల చిన్నారి జైనబ్‌పై అత్యాచారం కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం (ఏటీసీ) శనివారం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు 23 ఏళ్ల ఇమ్రాన్ అలీని దోషిగా తేల్చింది. అతనికి యావజ్జీవ శిక్షను విధించడంతో పాటు నాలుగు మరణశిక్షలు కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాక రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. జైనబ్ మాత్రమే కాక మరో ఏడుగురు బాలికలపై కూడా అత్యాచారం, హత్యలకు పాల్పడినట్లు ఇమ్రాన్ అలీపై గతవారం ఇదే కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.

ఈ కేసు కోసం ఈ నెల 12న కోట్ లక్‌పత్ జైలులో న్యాయమూర్తి సజ్జద్ అహ్మద్ 36 మంది సాక్షులను విచారించారు. కాగా, గతనెల 5న జైనబ్ కన్పించకుండా పోయింది. ఆ తర్వాత అదే నెల 9న ఆమె మృతదేహాన్ని షాబాజ్ ఖాన్ రోడ్డుకు సమీపంలోని ఓ చెత్తకుప్ప నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు న్యాయం జరగాలంటూ పాకిస్థాన్ వ్యాప్తంగా అనేక మంది ర్యాలీ చేపట్టారు. దోషికి న్యాయమూర్తి కఠిన శిక్ష విధించడంతో వారంతా ఇపుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News