కాళ్లు పట్టుకునే స్థాయికి కళా వెంకట్రావు దిగజారిపోయారు: విజయసాయి రెడ్డి
- రాజ్యసభ ఎన్నికల్లో వేమిరెడ్డిని నిలబెడతాం
- టీడీపీ అప్పుడే ప్రలోభాలకు తెరలేపింది
- కోడెల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
మంత్రి అచ్చెన్నాయుడు ఓ విలువలు లేని వ్యక్తి అని విజయసాయి విమర్శించారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో స్పీకర్ కోడెల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ హాస్టల్స్ ను మూసివేసి... నారాయణ విద్యాసంస్థలకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు.