'బిగ్ బాస్-2'కు 'నో' చెప్పిన జూనియర్ ఎన్టీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్-2'కు 'నో' చెప్పిన జూనియర్ ఎన్టీఆర్!

  • 'బిగ్ బాస్-2'కు ఎన్టీఆర్ దూరం
  • వరుస సినిమాలతో జూనియర్ బిజీ
  • షో చేయలేనని నిర్వాహకులకు స్పష్టం చేసిన ఎన్టీఆర్
టాలీవుడ్ లో వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్... 'బిగ్ బాస్' రియాల్టీ షోతో బుల్లి తెరపై కూడా సత్తా చాటాడు. తెలుగులో 'బిగ్ బాస్' హిట్ కావడానికి ఎన్టీఆర్ హోస్టింగే కారణమనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో, త్వరలోనే ప్రారంభం కానున్న 'బిగ్ బాస్-2' కార్యక్రమాన్ని కూడా ఎన్టీఆర్ తోనే హోస్ట్ చేయించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే, దీనికి ఎన్టీఆర్ సుముఖంగా లేడని తెలుస్తోంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించే మల్టీ స్టారర్ సినిమాలో ఆయన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కు తగిన సమయం కేటాయించలేని స్థితిలో జూనియర్ ఉన్నాడు. దీంతో, సీజన్-2కు తాను హోస్ట్ గా వ్యవహరించలేనని నిర్వాహకులకు ఎన్టీఆర్ చెప్పినట్టు సమాచారం. సినిమాలు, ఫ్యామిలీ కమిట్ మెంట్స్ వల్ల తాను ఈ కార్యక్రమాన్ని చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులను నిరాశపరిచేదే.
ntr
junior ntr
big boss
big bogss 2

More Telugu News