Andhra Pradesh: జీజీహెచ్ లో సెల్ ఫోన్ల వెలుతురులో ఆపరేషన్ సంఘటనపై మంత్రి కామినేని వివరణ

  • మహిళకు ఆపరేషన్ చేస్తుండగా నాలుగుసార్లు కరెంట్ పోయింది
  • సెల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్ పూర్తి చేశారు
  • ఈ సంఘటనపై డీఎంఈతో విచారణ జరిపిస్తాం: కామినేని
గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో సెల్ ఫోన్ల వెలుగులో వైద్యులు ఆపరేషన్ చేసిన సంఘటనపై మంత్రి కామినేని శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ఈ రోజు ఉదయం జీజీహెచ్ ని ఆయన సందర్శించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, మహిళకు ఆపరేషన్ చేస్తుండగా నాలుగుసార్లు కరెంట్ పోయిందని, దీంతో, సెల్ ఫోన్ల వెలుగులో వైద్యులు ఆపరేషన్ పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ జరిగిన మహిళను ఆయన పరామర్శించారు. ఆసుపత్రిలో పరిస్థితులపై సూపరింటెండెంట్ ని అడిగి వివరాలు సేకరించారు. ఈ సంఘటనపై డీఎంఈతో విచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు. 
Andhra Pradesh
Kamineni Srinivas
ggh

More Telugu News