Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపే రిలీజ్ కదా .. కంగారుగానే వుంది: నాని

  • డబ్బుకోసం తీసిన సినిమా కాదు 
  • ఇది ఒక భిన్నమైన ప్రయత్నం 
  • అందరినీ ఆశ్చర్య పరుస్తుంది
నిర్మాతగా మారిన నాని .. 'అ!' సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ .. " ఇది కాన్సెప్ట్ బేస్డ్ సినిమా .. కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ వ్రాసిన తీరు .. సినిమా తీసిన విధానం నాకు బాగా నచ్చాయి. ఇది డబ్బుల కోసం చేసిన సినిమా కాదు .. ఒక భిన్నమైన ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చేసింది".

"రొటీన్ గా వుండే అంశాలేవీ ఇందులో కనిపించవు. ప్రేక్షకులు సినిమా చూస్తూ.. బయటికి వస్తూ కూడా ఆశ్చర్యానికి లోనవుతూనే వుంటారు. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను డబ్ చేస్తున్నాం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. హీరోగా నా మొదటి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎంతగా కంగారు పడ్డానో, ఇప్పుడు అంతకుమించిన కంగారుగావుంది" అంటూ చెప్పుకొచ్చాడు.  
kajal
regina
nithya menon

More Telugu News