sundeep kishan: ఆ నిర్మాతే పెద్ద 420: సందీప్ కిషన్

  • ఆ నిర్మాత చెప్పిందంతా అబద్ధం 
  • నేను చాలా ఆందోళన చెందాను 
  • నాకు తెలిసి ఆయన మాటలను ఎవరూ నమ్మరు
ఆ మధ్య ఎస్.కె.బషీద్ అనే నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి .. "కుక్కతో అయినా సినిమా చేస్తానుగానీ, సందీప్ కిషన్ తో చేయను అని చెప్పారు" ఇది పెద్ద వివాదానికి దారితీస్తుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు మౌనంగా వున్న సందీప్ కిషన్, తాజాగా ఈ విషయాన్ని గురించి స్పందించాడు. " సన్నిహితుల మాటలకు విలువిచ్చే ఇప్పటివరకూ నేను ఈ విషయాన్ని గురించి మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్లినా అంతా అడుగుతున్నారు గనుక వివరణ ఇస్తున్నాను" అన్నాడు.

 "తమిళ మూవీ 'మాయావన్' హక్కులను బషీద్ తీసుకునేంత వరకూ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన నేపథ్యం గురించి తెలుసుకుని, ఈ సినిమా విడుదలయ్యేనా? అనే ఆందోళనకి లోనయ్యాను. ఆయన ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది తక్కువ .. చెప్పుకున్నది ఎక్కువ. ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు .. ఎన్నో కేసులు వున్నాయి. నిజం చెప్పాలంటే ఆయన ఓ పెద్ద 420 .. అలాంటి ఆయన నా గురించి అబద్ధాలు చెబితే నమ్మేదెవరు?" అంటూ చెప్పుకొచ్చాడు.    
sundeep kishan

More Telugu News