ASP Sunita Reddy: లెనిన్ తో ఏఎస్పీ సునీతారెడ్డి మొదటి పెళ్లి ఫొటోలివి!

  • నెట్టింట హల్ చల్ చేస్తున్న సునీతారెడ్డి మొదటి పెళ్లి ఫోటోలు
  • లెనిన్ ను ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్న సునీత
  • ఆమె వ్యవహారాలను మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయించిన పోలీసులు
తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగా పని చేస్తున్న సునీతారెడ్డి వివాహేతర సంబంధం కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చి, ఆమె సురేందర్ రెడ్డికన్నా ముందు లెనిన్ అనే యువకుడిని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందన్న షాకింగ్ న్యూస్ నిన్న వెలుగులోకి రాగా, ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

సీఐ మల్లికార్జునరెడ్డితో ఏఎస్పీ సునీతారెడ్డి కలిసుండగా, భర్త సురేందర్, సునీత తల్లి, పెద్దమ్మలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెప్పులతో కొట్టిన వీడియో గత నెలలో వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసు అధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. లెనిన్ ను 2002లో పెళ్లి చేసుకున్న సునీత, ఆపై అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని తెలుస్తోంది. ఆపై ఆ విషయాన్ని దాచి సురేందర్ రెడ్డిని చేసుకుని, మల్లికార్జున రెడ్డితో సంబంధం నడిపింది. మొత్తానికి సునీత ముగ్గురితో వ్యవహారం నడిపినట్టు తెలుస్తుండగా, పోలీసులు మరింత లోతుగా ఆమె వ్యవహారాలను పరిశీలించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ASP Sunita Reddy
Lenin
Surender Reddy
Mallikarjun
Police
Hyderabad

More Telugu News