Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న స్టోరీ లైన్ ఇదే... చెప్పేసిన మహేష్ బాబు సోదరి మంజుల!

  • రాజకీయాల్లోకి వచ్చే టాప్ హీరో
  • పవన్ వ్యక్తిత్వానికి సూటయ్యే కథ
  • అవకాశం లభిస్తే ఆయనతో సినిమా
  • వెల్లడించిన ఘట్టమనేని మంజుల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం తాను ఓ కథ రాశానని, దాన్ని వింటే ఆయన వెంటనే ఓకే చెప్పేస్తారని ఇటీవల వ్యాఖ్యానించిన నటి, దర్శకురాలు ఘట్టమనేని మంజుల ఇప్పుడా స్టోరీ లైన్ ను కూడా చెప్పేసింది. ప్రస్తుతం తాను తీసిన 'మనసుకు నచ్చింది' ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్న ఆమె, పవర్ స్టార్ కోసం తయారు చేసుకున్న కథపై మాట్లాడుతూ, సినిమా రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్న ఓ హీరో, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడన్న విషయంపై కథ రాసుకున్నట్టు చెప్పుకొచ్చింది.

తన కథ పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, తనకు అవకాశం లభిస్తే ఆయనతో సినిమా తీస్తానని వెల్లడించింది. తాను హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాయనని, కథ రాశాక ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తానని పేర్కొంది. మహేష్ బాబు ఇమేజ్ కి తగిన కథ తయారు చేయడం తన కలని తెలిపింది.
Pawan Kalyan
Mahesh Babu
Manjula
Story

More Telugu News