నెత్తురోడిన రహదారి... శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం, ఐదుగురి మృతి
- ఆటోను ఢీకొన్న టిప్పర్
- ముగ్గురికి తీవ్రగాయాలు
- మృతుల్లో పాలకొల్లు వాసులు
బీఎన్ కండక్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఉదయం ఘటన జరిగింది. మృతులు పాలకొల్లుకు చెందిన రామారావు, కుమారి, పీలేరుకు చెందిన బిందు, అనంత్, ఆటోడ్రైవర్ రమణలుగా గుర్తించారు. ఇదిలావుండగా, హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డివైడర్ ను ఓ కారు ఢీకొనగా ఇద్దరు మరణించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిలో బైక్ ను ట్రాక్టర్ ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడు.