అలా వర్మ దృష్టిలోపడ్డాను .. వరుస సినిమాలు చేశాను: సీనియర్ నటుడు జీవా
- శ్రీహరి వల్లనే హైదరాబాద్ వచ్చాను
- 'గులాబీ' సమయంలో కృష్ణవంశీ పిలిపించారు
- వర్మకి నా నటన బాగా నచ్చింది
"ఆ సమయంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా 'గులాబీ' సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వెతుకుతుండగా, కృష్ణవంశీకి నేను గుర్తుకువచ్చానట. దాంతో వర్మకి ఒక మాట చెప్పేసి, గుంటూరు నుంచి నన్ను పిలిపించారు. అలా 'గులాబీ'లో ఛాన్స్ దక్కింది. ఆ సినిమాలో నా నటన నచ్చడంతో, ఆ తరువాత తాను చేస్తోన్న సినిమాల్లోను వర్మ అవకాశాలు ఇచ్చారు. 'సర్కార్'లో నటించడం .. అమితాబ్ నన్ను మెచ్చుకోవడం నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ జీవా చెప్పుకొచ్చారు.