sai dharam tej: సాయిధరమ్ తేజ్ కథల్లో మార్పులు .. చేర్పులు

  • సక్సెస్ కి దూరంగా 'ఇంటిలిజెంట్' 
  • తరువాత సినిమా కరుణాకరన్ తో 
  • ఆ తరువాత సినిమా గోపీచంద్ మలినేనితో
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'ఇంటిలిజెంట్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఎప్పటిలానే మాస్ ఆడియన్స్ ను అలరించే హీరోయిజం .. ఫైట్లు .. చిరూను అనుకరించడం పట్ల విమర్శలు వచ్చాయి. దాంతో ప్రస్తుతం ఆయన చేస్తోన్న సినిమాలకి సంబంధించిన కథల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం.

సాయిధరమ్ తేజ్ తో కరుణాకరన్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ అంశాలు తగ్గించి యూత్ కి సంబంధించిన అంశాలను పెంచుతున్నారట. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేజు చేయనున్న సినిమాలోను హీరోయిజానికి సంబంధించిన బిల్డప్ సీన్స్ తగ్గించి, కామెడీకి .. కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఆ దిశగా మార్పులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇలానైనా తేజుకి హిట్ పడుతుందేమో చూడాలి.           
sai dharam tej

More Telugu News