team india: ఐదో వన్డేకు ముందు ఆందోళనలో టీమిండియా!

  • పోర్ట్ ఎలిజబెత్ లో ఐదో వన్డే
  • వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపనున్న వర్షం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్ లో మూడు వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా... నాలుగో వన్డేలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మెరుగైన స్కోరునే సాధించినప్పటికీ... వర్షం కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. ఐదో వన్డే పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఓ విషయం ఇప్పుడు టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోంది.

ఐదో వన్డేకు కూడా వర్షం ఆటంకంగా నిలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడితే... అది భారత విజయావకాశాలను దెబ్బ తీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్ మొత్తం రద్దైతే అది భారత్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పోర్ట్ ఎలిజబెత్ చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు.
team india
south africa cricke
one day match
port elizabeth

More Telugu News