jana jagarana samithi: ప్రేమికుల రోజును నిషేధించాలంటున్న జన జాగరణ సమితి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
  • భారతీయ సంస్కృతిని కాపాడాలి
  • ‘బ్యాన్ వ్యాలంటైన్ డే’ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జన జాగరణ సమితి
ఈ నెల 14న ప్రేమికుల రోజును నిషేధించాలని విశాఖపట్టణంలోని జన జాగరణ సమితి ప్రకటించింది. వుడా సెంట్రల్ పార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జన జాగరణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.వాసు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, ప్రేమికుల రోజును నిషేధించాలని, భారతీయ సంస్కృతిని కాపాడాలని డిమాండ్ చేశారు.

ప్రేమికుల రోజు పేరిట పార్కుల్లో, క్లబ్బుల్లో, పబ్ లలో విచ్చలవిడి శృంగార కార్యకలాపాలకు పాల్పడటం, మత్తు పానీయాల వినియోగం వల్ల సనాతన భారతీయ సంస్కృతి, విలువలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘బ్యాన్ వ్యాలంటైన్ డే’ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
jana jagarana samithi
vizag

More Telugu News