ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన రాహుల్ గాంధీ
- ఎపీ ప్రజల డిమాండ్లకు మద్దతు
- ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి
- న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాలి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వారి ఆందోళనలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఏపీ ప్రజల డిమాండ్లకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.