రోడ్డుపై గుండు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్యే!
- ఉయ్యూరులో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిరసన
- కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- ప్రజల ఆగ్రహావేశాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసనలు-బోడె ప్రసాద్
ఏపీకి న్యాయం చేయాలని నాలుగు రోజులుగా తమ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహావేశాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి గుండు చేసి పంపిన విధంగా విభజన చేశారని, అందుకే తాను గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు.