మేడారం తల్లులకు భక్తుల కానుకలు... ఆల్ టైం రికార్డుకు హుండీ ఆదాయం

  • మేడారంలో ఏర్పాటైన 200కు పైగా హుండీలు
  • జాతర అనంతరం లెక్కించిన అధికారులు
  • ఈ ఏటి ఆదాయం రూ. 4.87 కోట్లు
ఈనెలారంభంలో వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సుమారు కోటీ 25 లక్షల మంది భక్తులు పాల్గొనగా, భక్తులు భారీఎత్తున కానుకలు సమర్పించుకున్నారు. సమ్మక్క హుండీ, సారక్క హుండి, పగిడిద్దరాజు హుండీ అంటూ గద్దెల సమీపంలో దాదాపు 200కు పైగా హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు.

జాతర అనంతరం హుండీలకు వేసిన సీళ్లను తెరిపించి వచ్చిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 4.87 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. ఇది మేడారం జాతర చరిత్రలో సరికొత్త రికార్డని, గత సంవత్సరంతో పోలిస్తే హుండీ ఆదాయం పెరిగిందని అన్నారు.
Go Back to Shorts
Medaram
Hundi
Sammakka
Sarakka

More Telugu News