kona raghupathi: అదంతా నిజం కాదు.. నేను వైసీపీలోనే ఉంటా: ఎమ్మెల్యే కోన

  • ఇదంతా గిట్టనివారు చేస్తున్న ప్రచారం
  • పార్టీ మారే ప్రసక్తే లేదు
  • వైసీపీ నుంచి పోటీ చేసి, మళ్లీ గెలుస్తా
వైపీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ మారబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలపై కోన స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తానంటే గిట్టనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

2019లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, గెలిచి తీరుతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. బాపట్లను నల్లమడ జిల్లాగా చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
kona raghupathi
YSRCP
mla
bapatla

More Telugu News