మొబైల్ డేటా స్పీడ్ ను ఏ విధంగా పరీక్షిస్తున్నారో చెప్పాలంటూ ట్రాయ్ ఆదేశాలు
- పారదర్శకత, కచ్చితత్వం అవసరం
- అప్పుడే వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోగలరన్న ట్రాయ్
- ట్రాయ్ పరీక్షలకు, ప్రైవేటు సంస్థలకు పోలని లెక్కలు
ఈ పరిణామాల నేపథ్యంలో డేటా స్పీడ్ ధ్రువీకరణకు అనుసరిస్తున్న విధానాలను గురించి పారదర్శకంగా వెల్లడించాలని, దీంతో వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోగలరని ట్రాయ్ పేర్కొంది. ‘‘ఇంటర్నెట్ స్పీడ్ అన్నది 4జీ బ్రాడ్ బ్యాండ్ అనుభవానికి సంబంధించిన ప్రాథమిక అంశం. దేశంలో డేటా వినియోగం గణనీయంగా మారిపోయింది. బ్రాడ్ బ్యాండ్ సేవల్ని కొలిచేందుకు కచ్చితత్వం అవసరం. వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది తోడ్పడుతుంది’’ అని ట్రాయ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.