గ్రహణ నరబలి కేసు తేలింది... హంతకుడు క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే!
- కరీంనగర్ జిల్లా నుంచి పాపను తెచ్చిన రాజశేఖర్
- భార్య శ్రీలత ఆరోగ్యం కోసమేనట
- మొండాన్ని రికవరీ చేయనున్నామన్న పోలీసులు
తన భార్య శ్రీలత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలంటే నరబలి ఇవ్వాలని ఎవరో చెప్పిన మాటలు విని ఈ పని చేసినట్టు రాజశేఖర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పాపను కరీంనగర్ జిల్లాలోని ఓ తండా నుంచి తీసుకు వచ్చినట్టు కూడా చెప్పాడు. నరహరి ఇంట్లో అతని కుమారుడు రంజిత్, పూజారి సాయంతో పూజలు చేశామని చెప్పాడు. కాగా, పాప మొండాన్ని రికవరీ చేయాల్సి వుందని, రాజశేఖర్ కు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.