ఫ్లిప్ కార్ట్ లో 'ఆనర్ 9' లైట్ ఫ్లాష్ సేల్ ఈ రోజే!
- మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం
- రెండు వెర్షన్లలో లభ్యం
- వీటి ధరలు రూ.10,999, రూ.14,999
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనుగోలుకూ అవకాశం ఉంది. గ్లేసియర్ గ్రే కలర్, మిడ్ నైట్ బ్లాక్, శాఫైర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. మిర్రర్ ఫినిష్ తో ఉండే దీని వెనుక ప్యానెల్ కు 12 లేయర్ల గ్లాస్ ను వాడినట్టు కంపెనీ ప్రకటించింది. 2.5డీ గ్లాస్ కోటింగ్ రెండు వైపులా ఉండడం అదనపు ప్రత్యేక అంశం. ఇందులో మరో ఆకర్షణీయత ఏమిటంటే, నాలుగు కెమెరాలు. ముందు రెండు, వెనుక రెండు 13+2 మెగాపిక్సల్స్ కాంబినేషన్ తో ఉంటాయి.