Pawan Kalyan: ఏపీ మత్స్యకారులతో పవన్ కల్యాణ్ భేటీ!

  • హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కొనసాగుతోన్న భేటీ
  • తమ సమస్యలు వివరిస్తోన్న మత్స్యకారులు
  • ఏపీలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులు
త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌త్స్య‌కారులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం త‌మ స‌మ‌స్య‌ల‌పై దృష్టిపెట్టాల‌ని వారు కోరుతున్నారు. కాగా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల మత్స్యకారులు జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని క‌లిసి చ‌ర్చిస్తున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. మత్స్యకారులతో మాట్లాడుతూ పవన్ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాగా, వివిధ వర్గాల వారి సమస్యలు తెలుసుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ముందు ఉంచుతానని ఇటీవలే పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. 

More Telugu News

Pawan Kalyan
Jana Sena
Hyderabad