Narendra Modi: నరేంద్ర మోదీ ర్యాలీపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు!

  • బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన మోదీ
  • విమర్శలు గుప్పించిన ప్రకాశ్ రాజ్
  • మోదీ మార్పులు తీసుకొస్తాడని భావిస్తున్నారా అంటూ సెటైర్లు
ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. "2014లో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ నిరుద్యోగులు, రైతుల ముఖాలపై నవ్వులను పూయిచడంలో విఫలమైంది. బెంగళూరు ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ ఆ నవ్వులను తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారా?" అంటూ తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

బెంగళూరులో జరిగిన ర్యాలీలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలను గుప్పించారు. కేంద్ర నిధులను మళ్లిస్తూ, అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, బెంగళూరు మెట్రోకు కేంద్ర బడ్జెట్లో రూ. 17,000 కోట్లను కేటాయించామని చెప్పారు. కర్ణాటక రూపు రేఖలను మార్చేది బీజేపీనే అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.
Narendra Modi
Prakash Raj
siddaramaiah
tollywood
bengaluru

More Telugu News