Chandrababu: సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందించొద్దంటూ టీడీపీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు ఆదేశం!

  • సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు
  • ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టొద్దు
  • మిత్రధర్మాన్ని పాటిద్దాం
  • కార్యకర్తలు సంయమనం పాటించాలి: చంద్రబాబు సూచన
టీడీపీపై, ఆ పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలపై ఎవరూ స్పందించొద్దంటూ టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించినట్టు పార్టీ వర్గాల సమాచారం.

 సోము వీర్రాజు దిష్టిబొమ్మలు తగలబెట్టొద్దని, మిత్రధర్మాన్ని పాటిద్దామని..టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రెండు ఎకరాల పొలం మాత్రమే వున్న చంద్రబాబుకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందంటూ విమర్శించారు.
Chandrababu
Telugudesam
somu veeraj

More Telugu News