వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలనా ఫలాలు అందుతాయి: మంత్రి కేటీఆర్
- తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీని విడుదల చేసిన కేటీఆర్
- పలు మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు నిధులు కేటాయించాం
- ప్రభుత్వ సంస్కరణల అమలులో మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలి : కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని అన్నారు. పట్టణాల్లో ఇప్పటికే అర్బన్ మిషన్ భగీరథ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలసి సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ ఏడాది పలు పథకాలు కీలకమైన దశకు చేరుకున్నాయని, వాటిని పూర్తి చేసే దిశగా పని చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ల ప్రమోషన్లు, ఖాళీల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు కేటీఆర్ చెప్పారు.