Ponnam Prabhakar: ఏపీ ప్రభుత్వం పోరాటానికి రెడీ అవుతోంది.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో దాక్కున్నారు: పొన్నం ప్రభాకర్

  • కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
  • బీజేపీతో కుమ్మక్కైన కేసీఆర్
  • కేంద్ర సంస్థలను సాధించడంలో సీఎం విఫలం
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని... అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదీ పట్టించుకోకుండా, ఫామ్ హౌస్ లో దాక్కున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎయిమ్స్, బయ్యారం ఉక్కు వంటి వాటిని సాధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. బడ్జెట్ పై జరిగిన అన్యాయంపై ఏపీ ప్రభుత్వం పోరాటానికి సిద్ధమవుతుంటే... కేసీఆర్ మాత్రం బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినా... బీజేపీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇక్కడి నాయకులకు ప్రధాని మోదీ అంటే భయమని చెప్పారు.
Ponnam Prabhakar
KCR
Andhra Pradesh
BJP

More Telugu News