Arun Jaitly: కాసేపట్లో అరుణ్‌జైట్లీతో టీడీపీ ఎంపీల కీలక భేటీ.. తరువాత రాజ్‌నాథ్‌ సింగ్‌తో..!

  • మధ్యాహ్నం 3 గంటలకు జైట్లీ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీపీ ఎంపీలు
  • మధ్యాహ్నం 3.45 గంటలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ
  • విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై చర్చ
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక నిధులపై ప్రకటన చేయలేదని టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు కాసేపట్లో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని కలవనున్నారు. టీడీపీ ఎంపీలు మధ్యాహ్నం 3 గంటలకు జైట్లీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. అలాగే, మధ్యాహ్నం 3.45 గంటలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై వారు చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. 
Arun Jaitly
Andhra Pradesh
Telugudesam

More Telugu News