Allu Arjun: గడ్డకట్టించే చలిని కూడా లెక్కచేయని బన్నీ!

  • వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' 
  • సహజత్వం కోసం రిస్క్ చేస్తోన్న బన్నీ
  • ఏప్రిల్ 27న అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ 

అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య ' సినిమా రూపొందుతోంది. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షెడ్యూల్స్  చకచకా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో చిత్రీకరిస్తున్నారు. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ లో .. గడ్డకట్టించే చలిలో అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించవని యూనిట్ కి ముందే తెలుసట.

అయితే స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించడం వలన అనుకున్న ఎఫెక్ట్ రాదనీ, కష్టమైనా సహజంగా ఉండేలా చేద్దామని బన్నీ పట్టుపట్టాడట. దాంతో అక్కడే చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సన్నివేశాలు ఉత్కంఠను పెంచడమే కాకుండా, హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. విశాల్ - శేఖర్ బాణీలను అందించిన ఈ సినిమా నుంచి రెండవ పాటను ఈ నెల 14వ తేదీన వదలనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News