సమ్మక్క, సారక్క జాతర కోసం 22 తాత్కాలిక బార్ లు... 4 రోజుల అమ్మకాలు చూస్తే అవాక్కే!
- జాతరలో ఏరులై పారిన మద్యం
- రూ. 50 కోట్లకు పైగా అమ్మకాలు
- చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెరిగిన విక్రయాలు
మొత్తం రూ. 50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయని, గతంలో మేడారంలో ఇంత భారీ అమ్మకాలు ఎన్నడూ సాగలేదని అధికారులు అంటున్నారు. మేడారంతో పాటు వరంగల్ చుట్టు పక్కల ప్రాంతాలైన భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం తదితర ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో గణనీయంగా పెరిగాయని అధికారులు వెల్లడించారు.