ఆనందపు అంచులను చూసిన ఉద్వేగంలో.. గుండె ఆగి మరణించిన 16 ఏళ్ల యువతి!
- ఫ్రెండ్స్ తో కలసి బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన యువతి
- ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకున్న లానా హేమన్
- ఆనందిస్తూనే ఉద్వేగంతో కన్నుమూత
- మెక్సికోలో ఘటన
మెక్సికోకు చెందిన లానా హేమన్ అనే యువతి, ఫ్రెండ్స్ తోకలసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో వారు ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకుని మరీ ఆనందించారు. చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు లానా చాలా ఆనందంగా ఉందని, అదే విషయాన్ని తమకు వెల్లడించిందని చెప్పారట. ఆ యాంగ్జయిటీలోనే ఆమె కుప్పకూలి క్షణాల్లో మరణించిందని తేల్చారు. లానా చాలా ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుందని, శరీరంలో కెఫిన్ చాలా అధికంగా చేరడం వల్లే గుండె పోటు వచ్చిందని డాక్టర్లు తేల్చారు.