Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నంద‌మూరి బాలకృష్ణకు శ‌స్త్ర‌చికిత్స‌ విజయవంతం!

  • రొటేటర్‌ కఫ్‌ టియర్స్‌ ఆఫ్‌ షోల్డర్‌ అనే సమస్యతో బాధపడుతోన్న బాలయ్య
  • వాయిదా పడుతూ వస్తోన్న శస్త్రచికిత్స
  • కొంత కాలంగా తీవ్రమైన నొప్పి
రొటేటర్‌ కఫ్‌ టియర్స్‌ ఆఫ్‌ షోల్డర్‌ అనే సమస్యతో బాధపడుతోన్న సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో విజ‌య‌వంతంగా శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. ఈ మేర‌కు వైద్యులు ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్‌లో బాలయ్య‌ గాయపడ‌గా ఆయ‌న బిజీబిజీగా గ‌డుపుతుండడంతో సర్జరీ వాయిదా పడతూ వచ్చింది. దీంతో బాల‌య్య‌కు నొప్పి తీవ్రంగా బాధించింది. దీంతో ఎట్ట‌కేల‌కు బాల‌కృష్ణ  శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవ‌ల బాల‌య్య న‌టించిన‌ ‘జైసింహా’ మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. 
Balakrishna
operation
success

More Telugu News