Gorantla Butchaih Chowdary: ప్రజల ఓపిక నశించింది.. ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడటం సరికాదు: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

  • బడ్జెట్‌పై భగ్గుమంటోన్న టీడీపీ నేతలు
  • ప్రతి సీమాంధ్రుడి గుండె రగలిపోతోంది
  • కేంద్ర సర్కారు సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది
  • బీజేపీతో మిత్ర‌త్వంపై పదిరోజుల్లో ఏదోఒకటి తేలిపోతుంది
కేంద్ర బ‌డ్జెట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక నిధులు ప్రకటించకపోవడంతో టీడీపీ నేతలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు చూశాక కేంద్ర సర్కారుపై తమ భ్రమలు పటాపంచలయ్యాయని అన్నారు. ఓపిక నశిస్తే ఏపీ ప్ర‌జ‌లు తిరగబడతారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగిలిపోతోందని, కేంద్ర సర్కారు సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని విమ‌ర్శించారు. తాము ఇప్పుడు కూడా బీజేపీతో మిత్ర‌త్వంతో ముందుకు వెళ్ల‌డం మంచిది కాద‌ని, ఈ విష‌యంపై పదిరోజుల్లో ఏదోఒకటి తేలిపోతుందని తెలిపారు. 
Gorantla Butchaih Chowdary
Telugudesam
BJP

More Telugu News