kala venkatrao: విభజన హామీలు తప్ప కేంద్రాన్ని కొత్తగా ఏమీ కోరడం లేదు: కళా వెంకట్రావు

  • బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నాం..మిత్రధర్మం పాటిస్తున్నాం
  • ఏపీకి న్యాయం జరుగుతుందనుకున్నాం
  • ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు: కళా వెంకట్రావు
విభజన హామీలు తప్ప కేంద్రాన్ని కొత్తగా ఏమీ కోరడం లేదని ఏపీ టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నాం, మిత్రధర్మం పాటిస్తున్నామని, ఏపీకి న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలనే ఆలోచన, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయాలు ఉంటాయని, పొత్తులపై ఎన్నికలప్పుడే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.
kala venkatrao
Telugudesam
Andhra Pradesh

More Telugu News