Andhra Pradesh: ఒంగోలులో కాంగ్రెస్ ఎంపీల అర్ధనగ్న ప్రదర్శన!

  • కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది
  • మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు
  • ట్రాఫిక్ కు అంతరాయం
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై కాంగ్రెస్ ఎంపీలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంగ్రెస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. దీంతో, ట్రాఫిక్ జామ్ అవడంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండి చెయ్యి చూపారంటూ కాంగ్రెస్, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ డ్రామాలాడుతోందంటూ వైసీపీ నేత పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేయడం విదితమే.
Andhra Pradesh
Congress
ongole

More Telugu News