రాజస్థాన్ ఉపఎన్నికలు: మూడు స్థానాలూ కాంగ్రెస్ ఖాతాలోకే!

రాజస్థాన్ లో మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో కమలం వాడిపోగా, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటుకుంది. మందల్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, అజ్మీర్, అల్మార్ పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. ఇటీవల ఈ ఉపఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు ఈ రోజు నిర్వహించారు. ఈ విజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, ‘వెల్ డన్ రాజస్థాన్ కాంగ్రెస్! ప్రతిఒక్కరినీ చూసి గర్వపడుతున్నా. బీజేపీని రాజస్థాన్ ప్రజలు తిరస్కరించారనడానికి ఈ విజయం అద్దం పడుతోంది’ అన్నారు.

కాగా, రాజస్థాన్ లో బీజేపీ పరాజయం పాలవడంపై ఆ పార్టీ నేత కైలాశ్ విజయ్ వార్గియా స్పందిస్తూ, ఈ ఉపఎన్నికలో తమ పార్టీ పరాజయానికి గల కారణాలను తెలుసుకుంటామని, కేవలం, ఈ ఫలితాలను ఆధారంగా చేసుకుని ఏవో ఊహించుకోకూడదని అన్నారు. కాగా, ఈ ఉపఎన్నిక ఫలితాలు రాజస్థాన్ లోని అధికార బీజేపీికి మింగుడుపడటం లేదు.


More Telugu News