వ్యక్తి ప్రాణాలు కాపాడిన హోంగార్డులకు హ్యాట్సాఫ్‌ చెప్పిన మంత్రి కేటీఆర్‌!

హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని ఓ వ్యక్తి బైక్‌ పై వెళ్తు హఠాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి దగ్గరకు వెంటనే వచ్చి ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్‌ (కార్డియోపల్మనరి రెససిటేషన్‌) పద్ధతి ద్వారా ఛాతీపై మసాజ్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు.

ఆ తర్వాత 108కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. వారికి ట్విట్టర్‌లో అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. నగరంలో మరింత మంది కానిస్టేబుళ్లు సీపీఆర్‌ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుందని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.


More Telugu News