nitish kumar: జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

  • జమిలి ఎన్నికలతో సమయం, డబ్బు ఆదా 
  • అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావాలి
  • ఇప్పటికిప్పుడే సాధ్యమవుతుందని నేను అనుకోను
  • బీహార్‌లో ఇప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యం కాదు 
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.

జమిలి ఎన్నికలతో సమయం, డబ్బు ఆదా అవుతాయని, అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావాలని అన్నారు. ఏకాభిప్రాయం తీసుకురావడం ఇప్పటికిప్పుడే సాధ్యమవుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. అలాగే, బీహార్‌లో ఇప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యం కావని చెప్పారు. కాగా, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు అనే ప్రతిపాదనను కొన్ని పార్టీలు సమర్థిస్తుండగా వ్యతిరేకించే పార్టీలు కూడా ఉన్నాయి. 
nitish kumar
bihar
elections

More Telugu News