arsh khan: ప్రభాస్ తో నటిస్తున్నా... నమ్మండి, ఇది నిజం!: అర్షి ఖాన్

  • పేరు కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు
  • హైదరాబాదు నుంచి వచ్చిన నిర్మాతలు నన్ను కలిశారు
  • ప్రభాస్ ఆ సినిమాలో నటిస్తున్నాడని చెప్పారు
పేరు తెచ్చుకోవడం కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని, తాను నిజంగానే ప్రభాస్‌ సినిమాలో నటించబోతున్నానని బిగ్ బాస్ సీజన్ 11 ఫేమ్, నటి అర్షి ఖాన్‌ చెప్పింది. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిర్మాతలు తనను కలిశారని చెప్పింది. దీంతో వారిని తాను ముందు ఆ సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్ల వివరాలు ఆరాతీయగా, ఈ సినిమాలో ప్రభాస్‌ నటించబోతున్నాడని వారు తనతో చెప్పారని తెలిపింది.

అనంతరం తనతో ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారని చెప్పింది. ఆ తరువాత వారు తనకు రెండు, మూడు సార్లు ఫోన్‌ కూడా చేశారని తెలిపింది. నిర్మాతలతో టచ్‌ లో ఉన్నానని అర్షిఖాన్ తెలిపింది. ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పింది. నిర్మాతలు చెప్పిన విషయాన్నే తాను ట్వీట్ చేశానని, పేరు కోసం తప్పు చెప్పాల్సిన అవసరం తనకు లేదని అర్షి ఖాన్ తెలిపింది. 
arsh khan
Tollywood
movie
Prabhas

More Telugu News