Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒంట‌రిగా వెళుతోన్న‌ టీవీ యాంకర్‌ని వేధించిన యువకులు.. ఫేస్‌బుక్‌లో ఫొటోలు పోస్ట్ చేసిన యువ‌తి

  • ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
  • పని ముగించుకుని రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లిన యాంకర్ దామిని
  • బైక్‌పై వెంబడించిన యువకులు
  • ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేసిన యాంకర్
ఓ టీవీ యాంకర్‌ను ఇద్దరు యువకులు వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. టీవీ ఛానెల్‌లో తన విధులు పూర్తి చేసుకుని అర్ధరాత్రి సమయంలో తన స్కూటీపై ఇంటికి వెళుతోన్న యాంకర్ దామినిని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. చివరకు ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా ఆమె తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని ఎంజీ రోడ్‌ భగవాన్ టాకీస్ నుంచి త‌న‌ను ఇద్ద‌రు వెంబ‌డించార‌ని, వారు తన వెనకాలే వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

చాలా భయానికి గురైన తాను వేరే దారి గుండా వెళదామని నిర్ణయించుకుని, దారి మ‌ళ్లాన‌ని చెప్పింది. అయినప్పటికీ ఆ యువకులు తన వెనకాలే వచ్చారని ఆమె తెలిపింది. చివరకు వారి నుంచి తాను తప్పించుకున్న‌ట్లు పేర్కొంది. వారి ఫొటోలను తీసిన ఆమె ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. వారి బైక్ నెంబరును కూడా ఆమె పోస్ట్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
molest
agra
tv
anchor

More Telugu News