K Kavitha: పవన్ కల్యాణ్‌కి ఇక్కడ పోటీ చేసే హక్కు ఉంది!: టీఆర్ఎస్ ఎంపీ కవిత

  • టీఆర్ఎస్‌ మళ్లీ గెలుస్తుంది
  • కోదండరామ్ పార్టీ పెడితే స్వాగతిస్తాం
  • కేసీఆర్ వారసులు ఎవరనేది భవిష్యత్తులో తెలుస్తుంది
  • విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి
కేసీఆర్ వారసులు ఎవరనేది భవిష్యత్తులో తెలుస్తుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఈ రోజు తెలంగాణ సచివాలయానికి వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని, టీఆర్ఎసే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

ఇక తాను ఎమ్మెల్యేగానా? లేక ఎంపీగా పోటీచేయాలా? అనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. అలాగే, కోదండరామ్ పార్టీ పెడితే స్వాగతిస్తామని అన్నారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాగా, విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.  
K Kavitha
KCR
Telangana
Kodandaram
Pawan Kalyan

More Telugu News